Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 9:14 pm Posted by : ramakrishna

అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి

 

. . . నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన నగేష్ రెడ్డి

 

. . . జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా గాదారి గోపి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులుగా నియమింపబడిన సభ్యులకు నగేష్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ భవన్ లో బుధవారం నియమాక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి నూతనంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమింపబడిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీలో చోటు లభించడం అనేది సులువైన విషయం కాదని, పార్టీ కోసం నిబద్దతతో పనిచేసిన మీ అందరికీ పదవులు రావడం సంతోషంగా ఉందని తెలియజేశారు. జిల్లా కార్యవర్గంలో చోటు దక్కించుకున్న ఉపాధ్యక్షులు, కోశాధికారి అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఇప్పటినుండి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేయాలని నగేష్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు జిల్లా కార్యవర్గాన్ని నియమించడం జరిగిందని, జిల్లాలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతూ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం భక్తవస్తలం, కౌడపు శరత్, గోళ్ళ ఎర్రన్న, ప్రవీణ్ కుమార్ గౌడ్, జయ లలిత, పైసా ఎల్లయ్య, పవన్ కుమార్, ముస్కు వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Everyone should work together to take the party forward.
Everyone should work together to take the party forward.