. . . పోలిస్ కమీషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
రాబోయే మున్సిపల్ ,కార్పొరేషన్ ఎన్నికల లో పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా అందరం కలిసికట్టుగా పని చేయాలి అని నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాబోయే కార్పొరేషన్ ,మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య పోలీసు అధికారులతో ” సమీక్ష సమావేశం ” నిర్వహించారు. ఈ సంధర్బంగా సిపీ మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలు ,మునిసిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైనవి అన్నారు. ఈ ఎన్నికలను శాంతి యుతంగా స్వేచ్ఛాయుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించడంలో పోలీసు శాఖ పాత్ర అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి, సిబ్బందిఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేస్తూ, ఎటువంటి రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి,ముందస్తు చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చూడాలి అని అన్నారు. సామాన్య ప్రజలకుభద్రత,నమ్మకంకలిగేలా మన చర్యలు ఉండాలి. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తూ, సోషల్ మీడియా ద్వారా వ్యాపించే వదంతులను నియంత్రించడంలో అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఎన్నికల సమయంలోశాంతి భద్రతల పరిరక్షణే మన ప్రధాన లక్ష్యంకావాలి. ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకుని, సమన్వయంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా మనం అందరం కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డిసిపి (అడ్మిన్) బి. బస్వారెడ్డి,నిజామాబాదు,ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసిపిలు రాజా వెంకటరెడ్డి , శ్రీనివాస్ ,వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ అలీ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం , సిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య , ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ వీరయ్య, జిల్లాలోని సి.ఐ లు ఎస్.హెచ్.ఓ లు ,ఎస్ ఐ లు తదితరులు పాల్గోన్నారు.