Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 7:56 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి

  • పోలీస్ దర్బార్ లో సీపీ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ క్రమ శిక్షణతో విధులు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం పోలీస్ సిబ్బంది కి దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన ఆర్మ్ డ్ రిజర్వ్ (మహిళలు,  పురుషులు) సిబ్బంది, హోమ్ గార్డ్స్  (మహిళలు,  పురుషులు) సిబ్బందికి గల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ” సిబ్బందికి గల సమస్యలను ” తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలపారు. సమస్యలు అడిగి  తెలుసుకుని సత్వర చర్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బందికి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి ఒక్కరు మంచి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు.  సమాజంలో పోలీసుకు మంచిపేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వు ఇన్స్ పెక్టర్స సతీష్ (హోమ్ గార్డ్స్),  తిరుపతి (అడ్మిన్),  ఆర్.ఎస్.ఐలు శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, దేవి సింగ్ శేషారావు, దత్తు, ఆఫీస్ సూపర్డెంట్లు, శంకర , బషీర్ అహ్మద్ , వనజ రాణి, పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు షకిల్ పాషా, సిబ్బంది పాల్గొన్నారు.

Everyone should perform their duties with discipline.1254