వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
భిక్కనూరు మండలంలో మొక్కలు నాటిన షబ్బీర్ అలీ బతుకమ్మ, భిక్కనూరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు.ఆదివారం భిక్కనూరు మండలం భాగిర్తి పల్లి గ్రామంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో ముస్తాబుచేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైందని, ప్రకృతి పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి...