Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 9:35 pm Posted by : ramakrishna

వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

  • భిక్కనూరు మండలంలో మొక్కలు నాటిన షబ్బీర్ అలీ

 

బతుకమ్మ, భిక్కనూరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు.ఆదివారం భిక్కనూరు మండలం భాగిర్తి పల్లి గ్రామంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో ముస్తాబుచేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం  కార్యక్రమం ప్రారంభమైందని, ప్రకృతి పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి మరింత విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించాలనే సంకల్పంతో ముందడుగు వేసిందన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. అనంతరం గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపరి భీమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వామి,  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అటవీశాఖ అధికారులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Everyone should participate in the Vanamahotsavam.