వన మహోత్సవంలో అందరూ భాగమవ్వాలి
ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి పిలుపు కలెక్టర్ తో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిల్లాలో లాంచనంగా వన మహోత్సవం ప్రారంభం బోధన్, బతుకమ్మ: పచ్చదనాన్ని పెంపొందిస్తూ, భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలి, ఆహ్లాదకర పర్యవరణం అందించాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి బుధవారం బోధన్ పట్టణంలోని మధుమలంచ డిగ్రీ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లాంచనంగా మొక్కలు...