Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 8:15 pm Posted by : ramakrishna

దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

 

. . . వికసిత్ భారత్ లక్ష్యంగా 7కే రన్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

వికసిత్ భారత్ లక్ష్యంగా వర్ని మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుంచి రుద్రూర్ గ్రామ పంచాయతీ వరకు ఆదివారం 7 కే రన్ నిర్వహించారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్బంగా మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ జనార్దన్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ అభివృద్ధి పట్ల, ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి హక్కులతో పాటు బాధ్యతలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పార్వతి శేఖర్, సలహాదారులు ఇందూరు చంద్రశేఖర్, బచ్చు రామ్ సెట్, బెజుగం వెంకటేశం, దర్శి సాయిలు, సభ్యులు కర్రోళ్ల శివప్రసాద్, నూతిపల్లి బాల రాజ్, నవీన్ గౌడ్, మల్లారెడ్డి ప్రధానోపాధ్యాయులు భాస్కర్, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

 

Everyone should participate in the development of the country.