Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 5:19 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క రు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో మంగళవారం హైస్కూల్, ప్రైమర్ స్కూల్ విద్యార్థులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దోమలు, ఈగల గురించి వాటి వల్ల వచ్చే రోగాల గురించి కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం వల్ల వచ్చేటువంటి రోగాల గురించి వాటి వలన కలిగే ఇబ్బందుల గురించి కూలంకుషంగా వివరించారు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత హ్యాండ్ వాష్ గురించి కూడా తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షలు చేసి చిన్నచిన్న రుగ్మతలతో బాధపడే వారికి మందులు పంపిణీ చేశారు. అలాగే పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్స్ ను, శానిటేషన్ ను పరిశీలించారు. కిచెన్ లోకి వెళ్లి వంట చేసే సిబ్బందికి తగిన ఆరోగ్య సూత్రాలు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సలహాదారులు గురజాల నర్సారెడ్డి, వైద్య సిబ్బంది లావణ్య, శ్యామల లత, ఉపాధ్యాయ బృందం ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సుదర్శన్, అన్నపూర్ణ, శ్రీనివాస్, రమేష్, శ్రీనివాస్, కిరణ్ కుమార్, సుమతి, విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.