. . . పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
. . . బాన్సువాడ మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ.
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును ఆయన అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ జాబితాలు, ఓటర్ కంపార్ట్మెంట్లు, బ్యాలెట్ బాక్స్ లు ఇతర ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. అలాగే పోలింగ్ కేంద్రం లోపల, బయట భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు.