Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 7:22 pm Posted by : ramakrishna

ప్రతీ ఒక్కరు సైనికుడిల పని చేయాలి

మోర్తాడ్, బతుకమ్మ :  ప్రతి కార్యకర్త ఒక సైనికుడల పని చేయాలని మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని వచ్చే దానికి ఎన్నికల్లో విజయ డంక మోగించాలని పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో బూతు ఇన్చార్జులు బూతు కమిటీల తో సమావేశం నిర్వహించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సేవలు మరువలేను అని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Everyone should do military service