ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి
మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాన్సువాడ, బతుకమ్మ : రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. బాన్సువాడ మున్సిపాలిటీ సమీపంలో ఎండిపోయిన బోర్ వద్ద బోర్ చుట్టూ ఇంకుడు గుంతను ఏర్పాటు పనులను మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు...