సర్వేకు ప్రతీ ఒక్కరు సహకరించాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈరోజు నుండి 8 వ తేది వరకు మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేయడం జరుగుతున్నదని, ఎన్యూమ రెటర్స్ తమకు కేటాయించిన ఎన్యూమరేషన్ బ్లాక్ లో పర్యటించి గృహాలను సందర్శించి కుటుంబాల జాబితా...