ఇంటింటి సర్వేకు అందరూ సహకరించాలి 

 కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  నిజామాబాద్, బతుకమ్మ : ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో కూడిన సమాచారాన్ని అందించాలని సూచించారు. దర్పల్లి మండలం సీతాయిపేట్ లో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఇళ్లను సందర్శించి కుటుంబ...