సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలి

నిజామాబాద్, బతుకమ్మ: ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలను అందించాలన్నారు. ధర్పల్లి మండలం సీతాయిపేట్ లో ఇంటింటి కుటుంబ సర్వే తీరును కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఇళ్లను సందర్శించి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అతికించిన స్టిక్కర్లను చూసి, వాటిపై నమోదు చేసిన ఇంటి...