Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 8:00 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి

 

. . . మున్సిపల్ కమిషనర్ గజనంద్

 

భీమ్ గల్, బతుకమ్మ

 

ప్రతి ఒక్కరు భాద్యతగా తమ తమ ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలను భాద్యతగా నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ గజనంద్ అన్నారు. కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సీడీఎంఏ ఆదేశాల మేరకు పట్టణంలోని 8వ వార్డ్ ప్రజలకు “జల శక్తి అభియాన్ – జన భాగీ దారి జేఎస్ జేబీ -3.0 లో భాగంగా “క్యాచ్ ది రైన్” అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నీటి సంరక్షణ సంబంధించి అవగాహన కల్పించి, చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, వర్షాకాలం దృశ్య సీజనల్ వ్యాధులు రాకుండా దోమలకు కారణమైన ఇంటిలోని నిలువ నీటిని తొలగించాలని చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించడం వల్ల భూగర్భ జలాలను పెంచడంలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్ పర్సన్ సంటి లతా నర్సయ్య, 8 వ వార్డ్ కౌన్సిలర్ ఎం .సందీప్, 1 వ వార్డ్ కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేందర్, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.