Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 4:58 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

 

. . . సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మరాదు

 

. . . నిజామాబాద్ పోలిస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అన్నీ మతాల పండుగలను ప్రతీ ఒక్కరూ శాంతి యుతం గా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలిస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ మతాల పెద్దలతో పోలీస్ కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ హాల్ లో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పుడు రాబోయేటటువంటి ఉగాది, హోలీ,  రంజాన్ మాసాలను దృష్టిలో పెట్టుకొని ఈ శాంతి కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు.

 

Everyone should celebrate festivals in a peaceful atmosphere

అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రారంభం కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం హిందూ, ముస్లిం మత పెద్దలు, ఇతర సామాజిక ప్రతినిధుల తో జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని, అన్ని మతాల వారు సోదరభావంతో  ఉండాలని కోరారు. పవిత్ర రంజాన్ మాసంలో మసీదుల వద్ద ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఈ పండుగ వేళ అందరూ శాంతియుతంగా సహకరించాలని కోరారు.  ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించాలని లేదా డయల్ 100 ను సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఈ శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్న మత పెద్దల మాటను మీ కాలనీలలో ఉండే ప్రజలు వింటారని, మీరు తెలిపే ప్రతి విషయము సమ్యమానంగా ఉండే విధంగా తెలియజేయాలని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల కోసం తీసుకుంటున్న ఇతర చర్యల గురించి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసిపిలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిఐలు, జిల్లా లోని అన్ని మతాల మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Everyone should celebrate festivals in a peaceful atmosphere