Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 8:09 pm Posted by : ramakrishna

డ్రగ్స్ ను పారద్రోలడంలో అందరు భాగస్వాములు కావాలి

  • ఎక్సైజ్ సీఐ వేణు మాధవరావు

 

భీమ్ గల్, బతుకమ్మ : గ్రామాల్లో యువత డ్రగ్స్ జోలికి పోకుండా ఉండేందుకు, డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలడంలోప్రజలందరు భాగస్వాములు కావాలని ఎక్సైజ్ సీ.ఐ వేణు మాధవరావు అన్నారు. మంగళవారం భీమ్ గల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా మాధకాద్రావ్యాల నిరోధన అనే అంశంపై విద్యార్థుల కు అవగాహన కార్యక్రమం ను నిర్వహించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా సీ. ఐ. మాట్లాడుతూ విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఈ మాదకద్రవ్యాల వలలో పడకుండా వాటికి బలికాకుండా ఉండాలని కోరుతూ, ఏ ఒక్కరు కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతూ డ్రగ్స్ నివారిత గ్రామాలుగా మార్చడంలో ప్రతి ఒక్కరి చేయూత నివ్వాలని కోరారు. అవసరం కాబట్టి మీరందరూ ఈ డ్రగ్స్ ను నివారించడంలో పాలు పంచుకోవాలని విద్యార్థిని విద్యార్థులతో కోరుతూ,  యువత ఈ మత్తు పదార్థాల వలలో చిక్కుకున్నట్లయితే విద్యను పొందడంలో కానీ, ఎంప్లాయ్మెంట్ ను అందుకోవడంలో గాని, పాస్పోర్టు తీసుకోవడంలో గాని,ఇలా ఎలాంటి ప్రభుత్వ లాభదాయకమైన వసతులను పొందడానికి అనర్హులుగా ప్రకటించబడతారన్నారు. కాబట్టి ఇలాంటి మత్తుపదార్థాల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని సూచన చేశారు. ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ శాఖ ఎస్సై గోవర్ధన్, పోలీస్ ఎస్సై కే. సందీప్, అబ్దుల్ సత్తార్, ఏ.ఎస్.ఐ , ఎక్సైజ్ శాఖ అధికారులు , కళాశాల ప్రిన్సిపల్ సి జయపాల్ రెడ్డి, కౌన్సిలర్లు పల్లె శ్రీనివాస్ గౌడ్,  డాక్టర్ మండలోజు నర్సింహస్వామి, పోలీస్ అధికారులు ,కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Everyone needs to be involved in eliminating drugs.