Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 3:59 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

. . . ఏసీపి శ్రీనివాస్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని బోధన్ ఏసిపి శ్రీనివాస్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని కామధేను రైస్ మిల్ లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపి శ్రీనివాస్, ఆర్టీఓ శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాద సమయంలో ప్రాణ రక్షణకు కవచంలా పని చేస్తుందని తెలిపారు. అజాగ్రత్త వల్ల, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, బచ్చు రామ్ సెట్, పోలీసు సిబ్బంది, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.