Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 9:24 pm Posted by : ramakrishna

డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

 

. . . ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన “సే నో టు డ్రగ్స్” అవగాహన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వందేమాతరం, రాష్ట్ర గీతాలను ఆలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో మాదకద్రవ్యాలకు ఏమాత్రం స్థానం లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈగల్ ఫోర్స్, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన కోసం కఠిన చర్యలతో పాటు విస్తృత ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా, విక్రయం, వినియోగం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, డ్రగ్స్ నియంత్రణలో పనిచేస్తున్న పోలీసు శాఖ, ఈగల్ ఫోర్స్ సిబ్బందికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందన్నారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో చట్టాలు మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సామాజిక నాయకులు, సినీ ప్రముఖులు యువతను చైతన్యపరిచే కార్యక్రమాల్లో ముందుండాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముప్పు కలిగించే డ్రగ్స్ మాఫియాపై ఎంతటి కఠిన చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు.

 

1) మేదరి శ్రీనివాస్ తండ్రి నరసయ్య, వయసు:- 40, కులం:- మేదరి, వృత్తి:-కూలీ, ఉప్పలవాయి విలేజ్. 9010384848. 2) మేధారి గంగామణి భర్త శ్రీనివాస్, వయసు :-30, కులం మాదరి, వృత్తి:- కూలీ, ఉప్పలవాయి విలేజ్. వడ్లూరు రోడ్డు కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా వద్ద కామారెడ్డి నుండి ఉప్పలవాయి కు స్కూటీపై వెళ్తుండగా సైడ్ నుండి జింక వచ్చి ఢీకొట్టినది. భార్యా,భర్తలు ఇద్దరికీ గాయాలు కాగా భర్త కు కాలు విరిగినది. ప్రభుత్వాసుపత్రి కామారెడ్డి ట్రీట్మెంట్ నడుస్తున్నది కండిషన్ ప్రజెంట్ నార్మల్. PS Devanpalli Govt hospital KMR Police out post

 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వం ఒక్కటే కాకుండా ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అన్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక వాలంటీర్లుగా మారాలని, ఎక్కడైనా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు, అధికారులు, సామాజిక కార్యకర్తలు కలిసి యువతలో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. చెడు మార్గం ఆకర్షణీయంగా కనిపించినా దాని ఫలితం వినాశనమేనని, మంచి మార్గంలో నడవడం ద్వారా మాత్రమే వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజం సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో యువత సైనికుల్లా ముందుండి సమాజాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో డ్రగ్స్ నిర్మూలన కోసం కృషి చేస్తున్న ఈగల్ ఫోర్స్, పోలీసు శాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల సేవలను అభినందిస్తూ, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సినీ నటుడు రామ్ పోతినేని, సినీ నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని, చదువులో ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే విధంగా ముందుకు సాగాలని కోరారు. “నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ఉప ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

1) మేదరి శ్రీనివాస్ తండ్రి నరసయ్య, వయసు:- 40, కులం:- మేదరి, వృత్తి:-కూలీ, ఉప్పలవాయి విలేజ్. 9010384848. 2) మేధారి గంగామణి భర్త శ్రీనివాస్, వయసు :-30, కులం మాదరి, వృత్తి:- కూలీ, ఉప్పలవాయి విలేజ్. వడ్లూరు రోడ్డు కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా వద్ద కామారెడ్డి నుండి ఉప్పలవాయి కు స్కూటీపై వెళ్తుండగా సైడ్ నుండి జింక వచ్చి ఢీకొట్టినది. భార్యా,భర్తలు ఇద్దరికీ గాయాలు కాగా భర్త కు కాలు విరిగినది. ప్రభుత్వాసుపత్రి కామారెడ్డి ట్రీట్మెంట్ నడుస్తున్నది కండిషన్ ప్రజెంట్ నార్మల్. PS Devanpalli Govt hospital KMR Police out post