Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 5:10 pm Posted by : ramakrishna

హక్కులను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉంది

  • సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి అన్నారు. నగరంలోని రామకృష్ణ మట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి హాజరై మాట్లాడారు. ఈ రోజులలో పిల్లలపై అరాచకాలు చాలా జరుగుతున్నాయని, పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నారని తెలిపారు. వీటన్నింటినీ నిరోధించాలని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి ఎస్కే రసూల్ బి మాట్లాడుతూ పిల్లలు ఎలాంటి వివక్షతలు గురికాకుండా వారి సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని పేర్కొన్నారు. పిల్లల హక్కులను రక్షించే బాధ్యత మనందరి పైన ఉందని ఈ సందర్భంగా కోరారు. డాక్టర్ రవి కిరణ్ మాట్లాడుతూ పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని ఎలాంటి సమస్యలు ఎదురైనా దీటుగా ఎదిరించి విజయం సాధించాలని కోరారు. అనంతరం వివిధ ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ అశ్విని, సి డబ్ల్యూ సి సభ్యులు రాజేంద్రప్రసాద్, జేజే బి మెంబర్ శ్రీలత, డిసిపిఓ చైతన్యకుమార్, రిటైర్డెడ్ మాస్టర్ దారం గంగాధర్, జి సి డి ఓ భాగ్యలక్ష్మి, ఇందూరు యువత అసోసియేషన్ అధ్యక్షుడు సాయి బాబు, డి సి పి యు చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Everyone has a responsibility to protect rights.