Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2024, 6:57 pm Posted by : ramakrishna

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

మున్సిపల్ కమిషనర్ మకరంద్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : 18 సంలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయాలి అని నగరపాలక సంస్థ కమిషనర్ మంద మకరంద్ యువతను కోరారు. ప్రతి బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించబడుతుందన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో 18 సంలు నిండిన ప్రతి యువత ఓటు హక్కు నమోదుకు ప్రోత్సహించాల్సినదిగా రాజకీయ పార్టీల ప్రతినిధులను కమిషనర్ సూచించారు. షిఫ్ట్ అయినా వారి వివరాలు, మరణించినవారి వివరాలు తెలియజేసి సరియైన ఓటరు లిస్టు తయారికి సహకరించాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు నార్త్ సౌత్ తహసీల్దార్లు నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.