డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సంగీత రంగంలో సేవలందించిన పలువురికి సత్కారం
వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. రామదాసును స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది సంగీత విద్వాంసులు వాగ్గేయకారులుగా ఎదగాలన్నారు. ఈనేపథ్యంలో సంగీత రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులను సత్కారించారు.