Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 9:15 pm Posted by : ramakrishna

ప్రతి మహిళ ఎన్సీడీ పరీక్షలు నిర్వహించుకోవాలి

 

. . . కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట్

 

లింగంపేట్, బతుకమ్మ :

 

ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి ఎన్సీడీ పరీక్షలు నిర్వహించుకోవాలని కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ సూచించారు. గురువారం ఆయన లింగంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలు పైబడిన మహిళలు సంవత్సరానికి ఒకసారి ఎన్సీడీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందస్తుగా గుర్తించవచ్చని అన్నారు. వ్యాధిగ్రస్తులైన మహిళలకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎన్సీడీ పరీక్షల్లో అనారోగ్యానికి గురైన మహిళలకు ప్రతినెల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్య సహాయం పొందడం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల గురికావలసిన అవసరం ఉండదు అన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్సిడి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వైద్య శిబిరంలో 40 మంది మహిళలకు వైద్య పరీక్షలు చేయడం జరిగినది. అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వహించి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపిగది ఆపరేషన్ థియేటర్ ఇన్ పేషెంట్ గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ చౌహన్, వైద్యాధికారి హిమబిందు, ఎల్లారెడ్డి డివిజన్ సిహెచ్ఓ టాగూరు, లింగంపేట్ సర్పంచ్ కౌడ రవీందర్, ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్, ఏపిఎం వినోద్, సిహెచ్ఓ రమేష్, ఆశ కార్యకర్తలు,సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు పాల్గొన్నారు.

 

Every woman should undergo NCD screenings.