ప్రతి మహిళా శక్తిగా ఎదగాలి
. . . ఏపిఎం బత్తుల మాణిక్యం వేల్పూర్, బతుకమ్మ : ప్రతి మహిళ ఆర్థికంగా స్వావలంబన సాధించి దేశ ఆర్థిక రంగాన్ని శాసించే స్థాయికి ఎదగాలని వేల్పూర్ ఏపిఎం బత్తుల మాణిక్యం అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్యలో శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించి మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా సహకారం అందిస్తున్నామని...