Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 7:55 pm Posted by : ramakrishna

ప్రతి మహిళా శక్తిగా ఎదగాలి

 

. . . ఏపిఎం బత్తుల మాణిక్యం

 

వేల్పూర్, బతుకమ్మ :

 

ప్రతి మహిళ ఆర్థికంగా స్వావలంబన సాధించి దేశ ఆర్థిక రంగాన్ని శాసించే స్థాయికి ఎదగాలని వేల్పూర్ ఏపిఎం బత్తుల మాణిక్యం అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్యలో శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించి మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు. పెట్రోల్ బంకుల నిర్వహణ, బస్సుల నిర్వహణతో పాటు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. రుణాలను సద్వినియోగం చేసుకుని పిండి గిర్నీలు, కిరాణా దుకాణాలు, జనరల్ స్టోర్లు, కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి, బట్టల వ్యాపారం తదితర రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం ద్వారా కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకిషన్, ఏపీఓ అశోక్, సీసీలు వెన్న మురళి, సాయన్న, సరళ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.