వేల్పూర్, బతుకమ్మ :
ప్రతి పల్లె జల సిరి గా విరబూయాలని వేల్పూర్ ఏపియం బత్తుల మాణిక్యం అన్నారు. భూగర్భ జలాల పెంపుదల, నీటి సంరక్షణే ధ్యేయంగా వేల్పూర్ మండల కేంద్రంలో ‘జల సిరి’ మండల స్థాయి సమావేశాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి గ్రామానికి ఇంకుడు గుంతల నిర్మాణం, ఊర కుంటల పునరుద్ధరణ, పంట కుంటల ఏర్పాటుపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మహిళా సమాఖ్య అధ్యక్షుల సభ్యులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాల కిసాన్, యంపీవో సాయిలు తదితరులు పాల్కొన్నారు.