ఢిల్లీ యూనివర్సిటీ ఆచార్య వెంకటరామయ్య
డిచ్ పల్లి, బతుకమ్మ: ఈ తెలుగు అనే అంశంపై అంతర్జాలంలో తెలుగు బ్లాగులలో ఏవిధంగా రాయాలో అందుబాటులో ఉంటుందని, దీన్ని ప్రతీ విద్యార్థి వినియోగించకొని రచన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఢిల్లీ యూనివర్సిటీ ఆచార్య వెంకటరామయ్య తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం, భారతీయ భాష సంరక్షక కేంద్రం ఆధ్వర్యంలో పునఃశ్చరణ తరగతులు మంగళవారం ఘనంగా ముగిసాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆచార్య ఎస్. వి.సుబ్రమణ్య మాధవ శర్మప్రసంగిస్తూ గిరిజన భాషలపైన డాక్యుమెంటేషన్ గురించిన దశలను అట్లాగే ఫోనెటిక్స్ మార్ఫాలజీ తదితర అంశాల గురించి సంక్షిప్తంగా వివరించారు. ఎరుకల భాష పై పరిశోధన చేసిన విధానాన్ని తెలియజేశారు. విద్యార్థులలో ఐపీఏ చార్ట్ అవగాహనను కలిగించారు. మధ్యాహ్నం ముగింపు సమావేశంలో యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య యాదగిరి ముఖ్య అతిథిగా వచ్చి అభినందనలు తెలిపి తెలుగు శాఖను ప్రశంశించారు. విశిష్ట అతిథిగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యా ధనంజయ, భారతీయ భాషల సంస్థ మైసూర్ ప్రిన్సిపల్ రాకేష్ చేరుకోడు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఆర్తి హాజరయ్యారు.
