. . . నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే ప్రక్రియలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిత్తశుద్ధితో పాల్గొనాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సమగ్ర సర్వే పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు వివిధ మండలాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొరకు బాధ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వే కొనసాగుతున్న సందర్భంగా ప్రతి మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ తమ మండలాలలో సర్వే ప్రక్రియ 100% సక్రమంగా జరిగే విధంగా చూడాలన్నారు. ఏ ఒక్క ఓటు కూడా పోకుండా అందరూ ఎన్యుమరేషన్ ఫామ్ లు నింపే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. అదే విధంగా ప్రతి మండలంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి బూత్ లో ప్రజలకు ఎన్యూమరేషన్ ఫామ్ లు నింపడంలో బిఎల్ఎ సహాయ పడాలని తెలిపారు. ఇబ్బందులు ఉన్న దగ్గర పార్టీ నుంచి ఒకరిని బిఎల్ఓ కు ఇచ్చి ఫారంలు నింపే విధంగా చూడాలని, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా సర్వే పూర్తి అయ్యే విధంగా చూడాలని ఆయనన్నారు. అదే విధంగా గ్రామాలలో సమావేశాలు నిర్వహిస్తూ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించాలని, సీనియర్ నాయకులను జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులను సమన్వయ పరుచుకొని మండల కమిటీలను నియమించాలని నగేష్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా కోశాధికారి భక్తవస్తలం, డిసిసి ఉపాధ్యక్షులు తారా చాంద్, రత్నాకర్ గౌడ్, గోపి, రజిత యాదవ్, పాషా, అమృతాపూర్ గంగాధర్, బాలరాజు, చట్ల నరేష్, ముస్కు వెంకట రామ్ రెడ్డి, మేక వీర్రాజు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
