Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 6:12 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్క హిందువు సనాతన హిందు ధర్మాన్ని కాపాడాలి

 

. . . హనుమాన్ ఆలయంలో నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హిందూ ధర్మం కాపాడడం కోసం హిందూ సైన్యమంతా ఏకమై మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. హిందువులు వారి వారి ఇష్టానుసారంగా వివిధ పార్టీలలో ఉన్నప్పటికీ వారి అంతిమ లక్ష్యం మాత్రం హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ లో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

 

Every Hindu should protect Sanatan Hindu Dharma.

 

ఒకప్పుడు నిజామాబాద్ లోని వినాయక్ నగర్ లో ప్రత్యేకంగా ఏర్పడిన ఈ హనుమాన్ ఆలయం వల్ల ఈ ప్రాంతం హనుమాన్ జంక్షన్ గా పిలువబడుతుందని, అది ఈ ఆలయానికి ఉన్న గొప్పతనమని పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడి ప్రాంత వాసులు ముందుకు వచ్చి ఒక్కొక్కరి వద్ద చందాలు జమ చేసి 54 ఫీట్ల భారీ హనుమాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారని, ఇది జిల్లాకే గర్వ కారణమని కొనియాడారు. నిజామాబాద్ లోని ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. అఖిలభారత హనుమాన్ దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామిజీ మంగళ శాసనములతో హనుమాన్ దీక్ష స్వాములకు ప్రతినిత్యం బిక్ష (అన్నదాన ప్రసాదం) చేయబడుతుందన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులకు ఎమ్మెల్యే తన స్వ హస్తాలతో భోజనాన్ని వడ్డించారు.

 

Every Hindu should protect Sanatan Hindu Dharma.