- మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. నగర పాలక సంస్థ సిబ్బంది యొక్క అన్నీ ఏరియా లా శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటింటి చెత్త సేకరణ, కాలువలు శుభ్రపరచడం, రోడ్లు ఊడ్వడం లో అలసత్వం వహించరాదని సూచించారు. ప్రతి ఒక్కరు ఉద్యోగంలో అలసత్వం వహించరాదు అని హెచ్చరించారు. ఏటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జయ కుమార్, ఏఎంసి, సాజిద్ ఎస్ఎస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు.
