Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 April 2025, 5:13 pm Posted by : ramakrishna

ప్రతి ఉద్యోగి కార్యదక్షత చూపాలి

  • డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి

 

నిజామాబాద్ సీటీ, బతుకమ్మ : ప్రతి ఉద్యోగి కార్యదక్షత మున్ముదు కొనసాగించాలిని డీసీసీబీ చైర్మన్ కుంట  రమేష్ రెడ్డి సూచించారు. నగరంలోని బ్యాంకు ప్రధానం కార్యాలయంలో మంగళవారం ఎఫ్ వై 2024-25 ఎచీవ్ మెంట్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన ఆర్థిక సంవత్సరం ప్రగతి వివరించారు. ఈ ఘనత బ్యాంకు లో ఉన్న అన్ని స్థాయిలో లో గల ఉద్యోగులకు దక్కుతుందన్నారు. మనం ఇటువంటి కార్యదక్షత మున్ముందు కూడా కొనసాగించాలని తద్వారా రాష్ట్ర స్థాయిలో అన్ని రంగాలలో మంచి స్థానంలో (నిజామాబాద్ డసీసీబీ రైసింగ్ ) ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 1 తారీకు సంబరాల దినోత్సవం గా జరుపుకోవాలని అందుకు ప్రతీ ఉద్యోగి ఇది వరకు లాగే క్షేత్ర స్థాయిలో ఇదే పోరాట పటిమ చూపాలని మార్గ నిర్దేశం చేశారు.  క్షేత్ర స్థాయి లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా

Every employee must demonstrate efficiency.

వెనుకడుగు  వేయకుండా రికవరీ చేశారని, ముఖ్యం గా ఎన్పీఏ ఖాతా లను పూర్తి లీగల్ ప్రాసెస్ ద్వారా రికవరీ సాధించడం అభినందనీయం అని కొనియాడారు.  గడిచిన ఆర్థిక సంవత్సరం లో బ్యాంకు సాధించిన డిపాజిట్ లు  781.82 కోట్లు గా,  స్వల్పకాలిక, ధీర్ఘకాలిక రుణములు 1355.56 కోట్లు గా, ఎన్పీఏ7.82% గా, ఉన్నాయని అన్నారు. ఈ ప్రగతి ప్రయాణంలో తీసుకున్న అన్ని నిర్ణయాలలో సహకరించిన పాలకవర్గానికి ఈ సంధర్భముగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షులు నల్ల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడ్ అద్యక్షులు మార గంగారెడ్డి , పాలక వర్గ సభ్యులు,ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే, ఉన్నతాధికారులు, 63 శాఖల శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Every employee must demonstrate efficiency.