. . . రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్
బాన్సువాడ, బతుకమ్మ :
ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తన స్వగృహంలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, సవరణ, తన వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసి, నమోదు చేసిన దరఖాస్తు పత్రాలను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలి అని తెలిపారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తమ వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరుగా నమోదు కావాలన్నారు .కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని, ప్రతి అర్హుడైన ఓటరు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎలాంటి అపోహలు, దుర్వినియోగానికి తావు ఇవ్వకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దగ్గరుండి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కృష్ణారెడ్డి నారా రవీందర్ కౌన్సిలర్ ఖలేఖ్, కొట్టం గంగాధర్ మన్సూర్, బోడ భాస్కర్ శంకర్, ఎన్నికల అధికారులు, బిఎల్వోలు, ప్రజాప్రతినిధులు స్థానికులు పాల్గొన్నారు.