Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 5:40 pm Posted by : ramakrishna

ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి అర్హులైన ఓటరు పాల్గొనాలి

 

. . . 36, 37 డివిజన్లలో ఎస్ఐఆర్ అవగాహన ర్యాలీ

 

. . . కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షడు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి అర్హులైన ఓటరు భాగస్వామ్యం కావాలని, ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సకాలంలో సమర్పించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఆదివారం 36, 37 డివిజన్లలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐఆర్ అబ్సర్వర్ గన్ రాజ్ పర్యవేక్షణలో, బండారి రమేష్ సమన్వయంతో, 36వ డివిజన్ ఇంచార్జ్ విక్కీ యాదవ్, 37వ డివిజన్ ఇంచార్జ్ కరిపే శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు.

 

Every eligible voter must participate in the SIR process.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షడు బొబ్బిలి రామకృష్ణ హాజరయ్యారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి స్థానికులను కలుస్తూ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారమ్‌లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ప్రజలు తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సంబంధిత బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ)కు అందజేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకుని, అవసరమైన వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్, 38వ డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు బొబ్బిలి మురళి, ఈఆర్ఓ కోఆర్డినేటర్ వహీద్, ధాత్రిక భాస్కర్, ఆకుల వెంకటేష్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.

 

Every eligible voter must participate in the SIR process.