Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 1:32 pm Posted by : ramakrishna

అభివృద్దే లక్ష్యంగా ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలి 

 

. . . నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ తో ఎమ్మెల్యే ధన్ పాల్ సమీక్షా సమావేశం 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  : 

 

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం సమయపాలనతో, నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల స్థితి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతులు, ఇందిరమ్మ ఇళ్లకు నిధుల విడుదల, వీధి దీపాల నిర్వహణ, దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్కులు, రూ.5 కోట్ల ప్రత్యేక నిధుల వినియోగం, రూ.32 కోట్ల యు ఐ డి ఎఫ్ జంక్షన్ అభివృద్ధి పనులపై వివరాలు తీసుకున్నారు. ఆస్తి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. టి యు ఎఫ్ ఐ డి సి ఫేజ్-1 పనుల పూర్తి స్థితి, సోనీ ఫంక్షన్ హాల్ సమీప వంతెన, కళాభవన్ నిర్మాణం, అర్సపల్లి ఆర్ఓబి పురోగతిపై నివేదికలు సమర్పించగా, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అమృత్ 2.0 కింద యు జి డి పనులు, నీటి సరఫరా, టి యు ఎఫ్ ఐ డి సి ఫేజ్-2 (రూ.60 కోట్లు), ప్రగతి నగర్ శ్మశాన వాటిక, రామార్తి చెరువు సుందరీకరణ పనులపై సమీక్షించారు. దీంతో కలెక్టర్ స్పందించి అభివృద్ధి విషయంలో అర్బన్ నియోజకవర్గంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులతో తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పనులు ఎలా జరుగుతున్నాయో అవసరమైతే క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తానని ఎమ్మెల్యేకి కలెక్టర్ చెప్పారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫూలంగ్ వాగు ఆక్రమణలు తొలగింపు, నగరం కాలువ మరమ్మతులు, బొడ్డెమ్మ చెరువు సమస్యల పరిష్కారం, ఐదు ఇంటర్నల్ పార్కుల నిర్మాణ పురోగతిపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి శ్రీనిధి నిధుల వినియోగం, తల్లి-శిశు సంక్షేమ ఆసుపత్రి, బస్తీ దవాఖానాల పనితీరు, ఎన్ హెచ్ ఎం నిధుల వినియోగం, అక్రమ వైద్యులపై చర్యలపై నివేదికలు సమర్పించబడ్డా యన్నారు. ట్రాఫిక్ పోలీస్, ఉపాధి శాఖ రంజాన్ పండగ సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరు, రోడ్డు ఆక్రమణలపై చర్యలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, వికలాంగులకు ఉద్యోగ అవకాశాలపై చర్చించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సంక్షేమ శాఖ ఆసుపత్రిలో మరమ్మతులు, సిబ్బంది అందుబాటు, వేసవి ప్రత్యేక చర్యలు, వికలాంగులకు సహాయక పరికరాల పంపిణీ, వృద్ధులు, పిల్లల సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఇందూరు అర్బన్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్నపనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. నిధుల వినియోగంపై పారదర్శకత వహించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీరు విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసారు. ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శాఖ వారానికి ఒకసారి అభివృద్ధి పురోగతి నివేదిక సమర్పించాలన్నారు.

Every department should work in coordination towards development goals