శిక్షణలో ప్రతీ అంశాన్నిక్షుణ్ణంగా నేర్చుకోవాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : లైసెన్సు సర్వేయర్స్ శిక్షణలో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని, శిక్షణ అనంతరం ప్రభుత్వ పరంగా విధులు నిర్వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రెండు నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లైసెన్సు సర్వేయర్లకు రెండు నెలల పాటు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న శిక్షణలో ప్రతీ అంశాన్ని శిక్షకుల నుండి తెలుసుకోవాలని,...