హంగార్గ గ్రామ ప్రజల తరలింపు
బోధన్, బతుకమ్మ : బోధన్ డివిజన్ లో హంగార్గ గ్రామంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదివారం ఉదయం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, బోధన్ సబ్ కలెక్టర్ ఆదేశానుసారం వరద ముప్పు, నీటిమునిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో గ్రామ ప్రజలను బోధన్‌కు తీసుకువచ్చి, వారి బంధువుల వద్దకు చేర్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ తహసీల్దార్ విఠల్, ఆర్‌ఐ గంగాధర్, బోధన్ రూరల్ పీఎస్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ప్రజల సురక్షిత రవాణా...