Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2025, 11:39 am Posted by : ramakrishna

హంగార్గ గ్రామ ప్రజల తరలింపు

 బోధన్, బతుకమ్మ :  బోధన్ డివిజన్ లో హంగార్గ గ్రామంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదివారం  ఉదయం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.  కలెక్టర్, బోధన్ సబ్ కలెక్టర్  ఆదేశానుసారం  వరద ముప్పు, నీటిమునిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  ఆర్టీసీ బస్సుల్లో  గ్రామ ప్రజలను బోధన్‌కు తీసుకువచ్చి, వారి బంధువుల వద్దకు చేర్చారు.  ఈ కార్యక్రమంలో బోధన్ తహసీల్దార్ విఠల్, ఆర్‌ఐ గంగాధర్, బోధన్ రూరల్ పీఎస్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ప్రజల సురక్షిత రవాణా కోసం అధికారులు ముందుగానే సన్నద్ధమై వాహనాల ఏర్పాట్లు చేసి, జాబితాలు తయారు చేసి, పర్యవేక్షణతో తరలింపు చేపట్టారు.  ప్రజల భద్రత కోసం బోధన్ తహసీల్దార్ విఠల్,  ఆర్‌ఐ గంగాధర్ పర్యవేక్షిస్తూ ప్రతి కుటుంబం సురక్షితంగా బస్సుల్లో ఎక్కేలా చూసుకున్నారు. బోధన్ రూరల్ పీఎస్ సిబ్బంది రక్షణ, భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో సహకారం అందించారు. అధికారుల సమన్వయంతో ఈ తరలింపు సజావుగా సాగింది. ప్రజలు కూడా తమ భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను అభినందించారు.

అప్రమత్తంగా ఉండాలి : మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

జిల్లాలో కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ కు  భారీగా వరద వచ్చి చేరుతుందన్నారు.  మధ్యాహ్నం నుంచి నాలుగున్నర లక్షల క్కుసెక్ ల నీటిని విడుదల చేయాలనీ అధికారులకు సుదర్శన్ రెడ్డి సూచించారు.

భారీగా వరద వస్తున్న పట్టించుకోని అధికారులు

భారీగా వరద వస్తున్న పట్టించుకోని నీటి పారుదల అధికారులఫై  సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుబాటులో లేని నీటి పారుదల అధికారుల ఫై ఉన్నతాధికారులకు
ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

Evacuation of people from Hangarga village