కాసులు కురిపిస్తున్న ఈటీఆర్ 

 ఈటీఆర్ పేరిట ఎంఈవో రూ.9 వేల వసూల్ విద్యాశాఖలో వసూళ్ళ దందా నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యాశాఖలో ఇప్పుడు ఈటీఆర్ లు హాట్ కేకులయ్యాయి. జిల్లా విద్యాశాఖ తరపున కొందరు ఎంఈవోలు వసూళ్ళకు తెగబడుతున్నారు. ప్రతి విద్యా  సంవత్సరం సందర్భంగా కొత్త ప్రైవేట్ పాఠశాలల అనుమతులు రెన్యూవల్ లు,  ట్రాన్స్ ఫర్లు ప్రాతిపదికగా ఈటీఆర్ లను జారీ చేయడం జరుగుతుంది. దానిని సొమ్ము  చేసుకునే పనిలో పడ్డారు మండల విద్యాశాఖాధికారులు. మొన్నటి వరకు మండల విద్యాశాఖాధికారులు కొందరే పని చేయగా ఇటీవల ప్రభుత్వం సీనియర్...