Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2024, 5:13 pm Posted by : ramakrishna

మార్క్ ఫైడ్ సోయబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు

బతుకమ్మ, కమ్మర్ పల్లి : సోయబీన్ రైతులు దళారులతోనష్టపోకూడదని కమ్మర్ పల్లి మండల కేంద్రంలో గురువారం మార్క్ ఫైడ్ ఆధ్వర్యంలో సోయబీన్ కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేశారు. కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య తో కలిసి మార్క్ ఫైడ్ చైర్మన్ మార గంగారెడ్డి ప్రారంభించారు.గత పది సంవత్సరాల తర్వాత కమ్మర్ పల్లి మండల కేంద్రంలో రైతు మద్దత్తు ధర కోసం సెంటర్ ను ఏర్పాటు చేయించినట్లు సునీల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్క్ పెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బూత్ పురం మహిపాల్, రంజిత్, జైడి మధులత శ్రీనివాస్, అబ్దుల్ రఫీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.