బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు పోలీస్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర- డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంలో విద్యార్థుల కర్తవ్యం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఎస్సై ఆంజనేయులు బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్.ఐ మాట్లాడుతూ ఈ పోటీలు దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అధికారుల త్యాగాలను స్మరించుకోవడానికి, పోలీసులు సేవలు సమాజంలో వారి పాత్ర వంటి అంశాలపై అవగాహన పెంచడానికి నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు ఉన్నారు.
