ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాస రచన పోటీల నిర్వహణ
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం పోటీలు, హెయిర్ స్టైల్ పోటీలు, మెహందీ డిజైన్ పోటీలను మహిళా సాధికారత విభాగము తరపున నిర్వహించారు. విద్యార్థులు తమ వైవిధ్యమైన కళలను ఈ పోటీలలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రకాంత్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శంకరయ్య, టీఎస్ కే సి కోఆర్డినేటర్ శివకుమార్, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ గోదావరి, మహిళా...