ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం పోటీలు, హెయిర్ స్టైల్ పోటీలు, మెహందీ డిజైన్ పోటీలను మహిళా సాధికారత విభాగము తరపున నిర్వహించారు. విద్యార్థులు తమ వైవిధ్యమైన కళలను ఈ పోటీలలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రకాంత్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శంకరయ్య, టీఎస్ కే సి కోఆర్డినేటర్ శివకుమార్, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ గోదావరి, మహిళా సాధికారిక విభాగం సభ్యులు ఎన్.నాగానిక, సూపర్డెంట్ వసంతలక్ష్మి, రాణి, సంగీత, కీర్తి స్వప్న, శివ కుమార్, అమరేశం ప్రభాకర్ రావు, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దురాజ్, కృష్ణ ప్రసాద్, సంతోష్, శశిధర్, సురేష్ రెడ్డి మోయిన్ కిరణ్ కుమార్, మహమూద్, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
