Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2024, 4:58 pm Posted by : ramakrishna

ఎస్కేప్ గేట్ల ద్వారా ఎస్సారెస్పీ నీటి విడుదల

బతుకమ్మ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం ఉదయం 6 గంటలకు 9,254 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. వరద క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నానికి 11,454 క్యూసెక్కులు కావడంతో అధికారులు ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్లను ఎత్తి 1200 క్యూసెక్కుల నీటి గోదావరిలోకి విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా 5,800 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 2000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే రోజు 1090.80 అడుగులు, 79.658 టీఎంసీల నీరు ఉంది.