Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2024, 7:46 pm Posted by : ramakrishna

ఎస్సారెస్పీ రెండు గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల

బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి 15,702 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఆదివారం సాయంత్రం రెండు గేట్ల ఎత్తి గోదావరిలోకి 6,248 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.501 టిఎంసిల నీరు నిల్వ ఉంది.