మెండోరా, బతుకమ్మ: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి 18,826 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో మూడు వరద గేట్లను ఎత్తి దిగువకు 9,372 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ ద్వారా 5,200 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,200, లక్ష్మీ కాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.