ఇందూరు తిరుమలలో వైభవంగా ఏరువాక పూర్ణిమ వేడుకలు
మోపాల్, బతుకమ్మ : ఇందూరు తిరుమల క్షేత్రంలో సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిర్వహించే పలు విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమాలు సోమవారం వైభవంగా నిర్వహించామని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహారెడ్డి తెలిపారు. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించి, అనంతరం శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సమస్త లోకం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించారు. అలాగే వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా భావించే "ఏరువాక పూర్ణిమ" కార్యక్రమాన్ని కూడా...