బతుకమ్మ,ఏర్గట్ల: నూతనంగా నియమితులైన ఎస్సై పడాల రాజేశ్వర్ ను మంగళవారం రోజున మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఇట్టి సందర్భంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం మాట్లాడుతూ బదిలీ లో భాగంగా ఉద్యోగరీత్యా ఏర్గట్ల మండల కేంద్రానికి నూతన ఎస్సై గా పదవి బాధ్యతలు స్వీకరించిన పడాల రాజేశ్వర్ కు మండల పరిధిలోని గ్రామాల్లో శాంతి భద్రతల విషయంలో బిఆర్ఎస్ పార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం,మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, మండల బిఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, తాళ్ల రాంపూర్ మాజీ సర్పంచ్ భాను ప్రసాద్,ఏర్గట్ల సొసైటీ ఉపాధ్యక్షుడు సిగసారం గంగారాం,సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగులపల్లి అంజిరెడ్డి,బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు మారు నరేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లక్కం నరసయ్య, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు జైనుద్దిన్ పాల్గొన్నారు.