రాష్ట్రస్థాయి బహుమతులు అందుకున్న ఏర్గట్ల విద్యార్థులు
బతుకమ్మ,ఏర్గట్ల: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి కథలు,వచనకవిత్వం వ్యాస పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్గట్ల విద్యార్థులు ప్రతిభ చాటి బహుమతులు అందుకున్నారు. వ్యాసరచన పోటీలలో అభిలాష్ 9వ తరగతి విద్యార్థి మొదటి బహుమతి సంపాదించి 3000/ రూపాయల నగదు బహుమతి జ్ఞాపిక ప్రశంస పత్రాలు అందుకోగా, వైష్ణవి 9వ తరగతి విద్యార్థిని వ్యాసరచన పోటీలలో ప్రోత్సాహక బహుమతి అందుకుని 1000/ రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక ప్రశంస పత్రాలు...