బతుకమ్మ,ఏర్గట్ల: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి కథలు,వచనకవిత్వం వ్యాస పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్గట్ల విద్యార్థులు ప్రతిభ చాటి బహుమతులు అందుకున్నారు. వ్యాసరచన పోటీలలో అభిలాష్ 9వ తరగతి విద్యార్థి మొదటి బహుమతి సంపాదించి 3000/ రూపాయల నగదు బహుమతి జ్ఞాపిక ప్రశంస పత్రాలు అందుకోగా, వైష్ణవి 9వ తరగతి విద్యార్థిని వ్యాసరచన పోటీలలో ప్రోత్సాహక బహుమతి అందుకుని 1000/ రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక ప్రశంస పత్రాలు అందుకోగా నూనె శ్రీనిధి ఎనిమిదో తరగతి విద్యార్థిని కథ పోటీలలో ప్రోత్సాహక బహుమతి సంపాదించి 1000/ రూపాయల నగదు బహుమతి జ్ఞాపిక శంఖపత్రాలను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదులో జరిగిన బహుమతి ప్రధానోత్సవం లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతా రచయిత అందెశ్రీ తెలంగాణ సాహిత్య సంగీత అకాడమీ చైర్మన్ శ్రీమతి అలేఖ్య చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారని పాఠశాల తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో బహుమతులు పొంది ఏర్గట్ల పాఠశాలకు గౌరవం పెంచిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి మరియు ఉపాధ్యాయ బృందం స్కూల్ పిల్లల తల్లిదండ్రులు అభినందించారు.