Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2025, 4:10 pm Posted by : ramakrishna

ఏర్గట్ల విద్యార్థికి జాతీయస్థాయి కథల పోటీలో బహుమతి

 బతుకమ్మ,ఏర్గట్ల:  మాచిరాజు బాలసాహిత్య పీఠం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయస్థాయి బడి పిల్లల కథల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్గట్ల లో ఏడవ తరగతి చదువుతున్న రూపక్ రాసిన చెట్లను కాపాడుకుందాం అనే కథకు బహుమతి లభించింది. మాచిరాజు బాల సాహిత్య పీఠం వారు గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయడానికి జాతీయస్థాయిలో కథల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని, దానిలో భాగంగానే గత ఫిబ్రవరిలో ఈ పోటీలను నిర్వహించగా, సుమారు రెండు రాష్ట్రాల నుండి 542 కథలు రాగా దానిలో నుండి 30 ఉత్తమ కథలకు బహుమతులు ప్రకటించారని, అందులో ఏర్గట్ల గ్రామ విద్యార్థి రూపక్ రాసిన కథకు బహుమతి లభించిందని,త్వరలోనే హైదరాబాదులో జరిగే బహుమతి కార్యక్రమంలో నగదు బహుమతితోపాటు, జ్ఞాపిక, ప్రశంస పత్రం అందజేస్తారని తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. జాతీయస్థాయిలో బహుమతి సంపాదించిన రూపక్ నీ పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.